Hufet - Telugu Tamil Malayalam Movies Trailers Gallery Interviews Video Songs

The Indian Multi talented legendary director Sri Dasari Narayana Rao Garu Passes Away

ఒక దర్శకుడు (153 ) , నటుడు , నిర్మాత (53), కధా, సంభాషణ , స్క్రీన్ ప్లే (250) మరియు పాటల రైటర్ గా సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞను అనితర సాధ్యం గా, అప్రతిహతంగా గత కొన్ని దశాబ్దాలు గా నిలవడం , సినీరంగం తో పాటుగా పత్రికా రంగం , టీవీ బుల్లి తెర, రాజకీయ రంగం మరియు సినీ కార్మిక , దర్శక, నిర్మాత, నటులకు అందరికి ఏ విధమైన కష్టం వచ్చినా, అవసరం వచ్చినా అందరికి ముందుండి అండగా నిలబడిన ధీరుడు దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు గారు.

గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుచున్న శ్రీ దాసరి నారాయణ రావు గారు నిన్న కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు , వారికి ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె ఉన్నారు. శ్రీ దాసరి నారాయణ రావు గారి సతీమణి మరణించి కూడా ఎక్కువ కాలం కాలేదు.

శ్రీ దాసరి నారాయణ రావు గారికి ఎన్నో అవార్డులు వరించాయి. ముఖ్యంగా రెండు జాతీయ అవార్డులు, తొమ్మిది నంది అవార్డులు , ప్రఖ్యాత రఘువతి వెంకయ్య అవార్డు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు వారు అందుకోవటం జరిగింది .

గురువు వంద సినిమాలు పూర్తి చేస్తే , వారి శిష్యులు కూడా వంద సినిమాలు పూర్తి చెయ్యడం ఒక్క శ్రీ దాసరి గారికే సాధ్యమైనది. శ్రీ దాసరి గారు నూట యాభై సినిమాలు పూర్తి చేస్తే , వారి శిష్యుడు శ్రీ కోడి రామ కృష్ణ గారు కూడా వంద సినిమాలు దర్శకుడిగా పూర్తి చేసారు.

శ్రీ దాసరి గారు సినిమాకి కధే నిజమైన హీరో అని బలంగా నమ్మి, మొదటి సినిమా " తాత - మనవడు " తో నిరూపించి ప్రజల అభిమానం తో పాటు , నంది అవార్డు సాధించారు. ఎంతో మంది యువ నటీ , నటులలో ఉన్న ప్రతిభను గుర్తించి , వారికి అవకాశం తన సినిమాలలో ఇచ్చే వారు. అలాంటి వారు ఎందరో ఈరోజు స్టార్స్ గా వెలుగు తున్నారు. శ్రీ దాసరి గారి ప్రతిభ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తమిళ, కన్నడ , హిందీ అన్ని భాషలకి వ్యాపించింది.

శ్రీ దాసరి గారి ప్రతిభ కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తమిళ, కన్నడ , హిందీ అన్ని భాషలకి వ్యాపించింది. వారు యువ కధా నాయకుల దగ్గర నుంచి సీనియర్ కధా నాయకుల వరుకు సూపర్ హిట్స్ ఇవ్వడం జరిగింది. శ్రీ యన్.టి .ర్ , ఏ.న.ర్ , కృష్ణ , కృష్ణంరాజు, శోభన్ బాబు ,మోహన్ బాబు , చిరంజీవి , అర్ . నారాయణమూర్తి అందరితో కమర్హియల్ విజయాలను ఇచ్చారు.

శ్రీ దాసరి గారు అందరికి ఆప్తుడు గా , ఆయన లేని లోటు తెలుగు సినిమా రంగానికి పూడ్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి ప్రార్ధి స్తూ --- హుఫెట్ (Hufet.com)

More Related Movie News


Actress Shilpa Shetty

Senior Actress Dimple Kapadia

Senior Actor Giri Babu