Hufet - Telugu Tamil Malayalam Movies Trailers Gallery Interviews Video Songs

Interview with Rakul Preet

There are so many heroines came from north to telugu film industry who became most successfull. But among them Rakul preet is more auspicious. She is very quick learner, learned telugu in the early stage of her heroine career. Her appearance, body language, and tradition everything seems to be purely telugu native girl with such qualities now she throbbed hearts of youngsters. In the upcoming family love story “randoi veduka choodham” she paired with Naga Chaitanya. This movie releasing on 26th May 2017.

‘రారండోయ్‌’లో మీరు పోషించిన భ్రమరాంబ పాత్ర విశేషాలేంటి?

ఇప్పటిదాకా ఇలాంటి పాత్రలో నేనెప్పుడూ కనిపించలేదు. భ్రమరాంబ పాత్ర చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. నాకు ఈ అవకాశాన్నిచ్చిన దర్శకుడు కల్యాణ్‌కృష్ణకి మొదట కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమా చేస్తున్నన్నాళ్లూ నేను భ్రమరాంబగా మారిపోయా. ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నా.

అంత ప్రత్యేకత ఏముంది ఆ పాత్రలో?

‘నిన్నే పెళ్ళాడతా’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తదితర చిత్రాల్లో కథానాయికల పాత్రలు ఎంత బలంగా ఉంటాయో అలాంటిదే ఇది. విభిన్నమైన హావభావాల్ని, నటనని ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. నిన్నటితరం కథానాయికలు మాత్రమే ఇలాంటి పాత్రల్లో కనిపించారు. చిన్న పోస్టర్‌ కూడా చాలా సహజంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత్రల్లో అంతగా ఒదిగిపోయాం.

అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం... అని ప్రచార చిత్రాల్లో సంభాషణ ఉంది. అబ్బాయిల్ని అంతగా ఇబ్బంది పెట్టే పాత్రనా?

అలాంటిదేమీ కాదు. హానికరం అంటే కొంచెం కొంచెం మనుషుల్ని చంపేస్తుంది. కానీ అబ్బాయిలు మాత్రం విషపూరితం అంటుంది భ్రమరాంబ. అలాంటి గడుసైన అమ్మాయి పాత్ర కాబట్టి సన్నివేశాలకి తగ్గట్టుగా ఆ సంభాషణని పలికించారు దర్శకుడు.

అచ్చమైన తెలుగమ్మాయిలా లంగా ఓణీ ధరించి కనిపించారు. ఉత్తరాది అమ్మాయైన మీరు తెలుగు వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులేమైనా పడ్డారా?

అసలు నేను ఏ కోణంలో ఉత్తరాది అమ్మాయిగా కనిపిస్తున్నా? (నవ్వుతూ). కట్టు, బొట్టు, భాష... ఇలా అన్ని విషయాల్లోనూ తెలుగమ్మాయిలానే కనిపిస్తున్నా కదా! దిల్లీ అమ్మాయిని అనే మాటని ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పినా వాళ్లు నమ్మరు. ఆఖరికి తమిళ పరిశ్రమలోకి వెళ్లినా ఆ భాషని తెలుగులో తర్జుమా చేసే చెబుతుంటారు. అలాంటప్పుడు తెలుగమ్మాయి పాత్ర, వేషధారణ విషయంలో ఎందుకు ఇబ్బందులు ఎదురవుతాయి?

ప్రచార చిత్రాలు చూసి మీకూ, నాగచైతన్యకీ మధ్య కెమిస్ట్రీ బాగా పండిందంటున్నారు...

దర్శకుడు తీర్చిదిద్దిన పాత్రల మహత్యమే అది. పాత్రల్లో బలం లేకపోతే ఎవ్వరం ఏమీ చేయలేం. కానీ ఈ సినిమాతో నాగచైతన్యతో కలిసి నటించడం మంచి అనుభవం. మేం ఎప్పట్నుంచో మంచి స్నేహితులం. ఒక స్నేహితుడితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. పైగా సెట్‌లో తను నడుచుకొనే విధానం కూడా చాలా బాగుంటుంది. ఆ విషయంలో అందరికీ శిక్షణ కూడా ఇవ్వమని చెబుతూ ఆట పట్టిస్తుంటా (నవ్వుతూ).

నాగార్జున డోల్‌ క్వీన్‌ అంటున్నారు మిమ్మల్ని...

సినిమా చూశాక నా పాత్ర గురించి నాగ్‌ సర్‌ చాలా చాలా చెప్పారు. ‘డోల్‌ బాగా కొట్టావ్‌, ఇంతకుముందు అనుభవం ఏమైనా ఉందా?’ అని అడిగారు. ఇదే మొదటిసారి అని నేను చెప్పా. అప్పట్నుంచి ఆయన డోల్‌ క్వీన్‌ అనే పిలుస్తున్నారు. ఆయన నా పాత్రని, అందులో నా అభినయాన్ని మెచ్చుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం.

ఇందులో బలమైన పాత్ర దక్కిందని ప్రత్యేకంగా చెబుతున్నారు. కథానాయికల కోసం తీర్చిదిద్దుతున్న పాత్రలపై మీ అభిప్రాయమేంటి?

ప్రేమకథల్లోనే కథానాయికలకి ప్రాధాన్యమున్న పాత్రలు దక్కుతాయి. మిగతా వాణిజ్య కథల్లో కథానాయకులదే ఆధిపత్యం. అలాగని ఆర్నెళ్లు ఎందుకు ఖాళీగా కూర్చోవాలి? అందుకే మంచి పాత్రలు వచ్చినప్పుడు వదలకుండా చేస్తాం, లేనప్పుడు వాణిజ్య చిత్రాల్లోనే నటిస్తుంటాం. ప్రతిసారీ ఇలాంటి బలమైన పాత్రలే దొరకాలంటే కష్టం. ఆ విషయంలో నాకెలాంటి అసంతృప్తి లేదు.

ఒక పక్క స్టార్‌ కథానాయకులతోనూ మరో పక్క నాగచైతన్య, బెల్లంకొండ శ్రీనివాస్‌ తదితర యువ కథానాయకులతోనూ కలిసి నటిస్తున్నారు. ఆ విషయంలో మీ అభిప్రాయం?

స్క్రిప్టు బాగుందంటే కథానాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాలోని నటికి సవాల్‌ విసిరే పాత్ర దొరికిందంటే సాధ్యమైనంత వరకు ఆ సినిమాని చేయడానికే ఇష్టపడతా. అయినా అందులో తప్పేముంది? హిందీలో చూడండి... ఆలియాభట్‌ ఒక పక్క యువ కథానాయకులతోనూ, మరోపక్క షారుఖ్‌ఖాన్‌లాంటి అగ్ర కథానాయకులతోనూ కలిసి తెరను పంచుకొంది. అనుష్కశర్మ కూడా అంతే కదా! ఆ విషయంలో నేను పెద్దగా ఆలోచించను.

అనుష్క శర్మలా మీరు కూడా నిర్మాతగా మారే ఆలోచనలేమైనా ఉన్నాయా?

లేదు అని చెప్పను (నవ్వుతూ). అయితే ఇప్పుడు కాదు. అయినా నెలవారీ జీతంతో నడిచే కుటుంబం నుంచి వచ్చినదాన్ని. అందుకే త్వరగా డబ్బు ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పుకోవడం లేదు (నవ్వుతూ). ఇంకొన్నాళ్లు గడిచాక ఎలాంటి నిర్ణయం తీసుకొంటానో చెప్పలేను.

ప్రేమ పెళ్లి చేసుకొంటారా? పెద్దలు కుదిర్చిన పెళ్లేనా?

ప్రేమ పెళ్లి అంటేనే ఇష్టం. అయితే ప్రేమలో లేను. ‘రారండోయ్‌...’లో భ్రమరాంబ రాకుమారుడి కోసం ఎదురు చూస్తుంటుంది. నేనూ అలా ఎదురుచూడటానికి రెడీనే కానీ...రాకుమారుడే ఎక్కడున్నాడో (నవ్వుతూ).

సచిన్‌ తెందుల్కర్‌ని ఇంటర్వ్యూ చేశారు కదా..ఆ అనుభవం గురించి చెబుతారా?

జీవితంలో అలాంటి అవకాశం ఒక్కసారే వస్తుంది. ఆయన ముందు కూర్చోవడం నా అదృష్టంగా భావించా. ఓ ఛానల్‌ కోసం చేసిన ఇంటర్వ్యూ అది. ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఇంటర్వ్యూలోనే కాకుండా విడిగానూ ఆయన జీవితంలో ఎత్తు పల్లాల గురించి చెప్పారు. జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలవి.

More Interviews